చుంచుపల్లి రహదారిపై రెండు బైకులు డీ

 

 

 

 

 

 

 

ఒకరి పరిస్థితి విషమం… పలువురికి తీవ్ర గాయాలు

మంగపేట జనవరి 21(జనంసాక్షి)

రెండు బైకులు ఎదురెదురుగా వస్తు డీకొట్టుకొని ప్రమాదానికి గురైన సంఘటన మండలంలోని చుంచుపల్లి రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చోటుచేసుకుంది. సంఘటన స్థలంలోని వారి వివరాల ప్రకారం మణుగూరు కు చెందిన ఒక వ్యక్తి ఒక బైకుపై అలాగే వెంకటాపురం కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక బైకుపై ఉన్నారని తెలిపారు. వారు ప్రయాణిస్తున్న బైక్ లు ఒక్కసారిగా ఎదురెదురుగా రావడంతో ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడం జరిగిందని ఈ ప్రమాదంలో మణుగూరుకు చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉందంటూ అలాగే వెంకటాపురం కు చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం . సంఘటన స్థలంలో ఉన్నవారు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించడంతో సంఘటన స్థలనం చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది తీవ్రంగా గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం తరలించినట్లు సమాచారం.