యూపీఐ చెల్లింపులు సంక్షోభంలో పడ్డాయి: ఒక నెలలో మూడవసారి అంతరాయం వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది
హైదరాబాద్ (జనంసాక్షి): యూపీఐ లావాదేవీలకు టెక్నికల్ సమస్య వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం యూపీఐ పేమెంట్స్ జరగలేదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ సంస్థలన్నీ మొరాయించాయి. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. రాయించిన గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం .. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ పేమెంట్స్ హైదరాబాద్: డిజిటల్ పేమెంట్ సర్వీసుల కు ఇవాళ బ్రేక్ పడింది. ఉదయం నుంచి యూపీఐ పేమెంట్స్ సరిగా జరగడం లేదు. దేశవ్యాప్తంగా ఇవాళ ఆ సమస్య ఉత్పన్నమైంది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్ మొరాయిస్తున్న నేపథ్యంలో.. ఆన్‌లైన్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, హోటళ్ల వద్ద.. యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి. ఒకవేళ పేమెంట్ చేసినా.. ఎర్రర్ అని లేదా పెండింగ్ అని చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా యూపీఐ సమస్యలు వస్తున్నట్లు.. సోషల్ మీడియా యూజర్ల ద్వారా స్పష్టమవుతోంది. బిల్ పేమెంట్స్ దగ్గర సమస్య రావడంతో.. అందరూ క్యాష్ అడుగుతున్నారు. దీంతో కొందరు కస్టమర్లు వెనుదిరిగి పోవాల్సి వస్తోంది. డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా యూఐపీ పేమెంట్ సమస్యలు వెల్లడయ్యాయి. ఆ వెబ్‌సైట్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం వేళ పేమెంట్స్ సమస్యలు తీవ్రంగా వచ్చినట్లు తెలుస్తోంది. పేమెంట్స్ చేయడంలో సుమారు 66 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 34 శాతం మందికి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం కష్టంగా మారింది. చాలా వరకు బ్యాంకులు, యాప్‌ల్లో ఈ సమస్య తలెత్తింది. అయితే ఏ కారణం చేత . యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయో ఇంత వరకు స్పష్టం కాలేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ దిగ్గజ యూపీఐ ప్లాట్‌ఫామ్స్ కానీ దీనిపై వివరణ ఇవ్వలేదు.