నిజామాబాద్‌ జిల్లాలో యూరియా కష్టాలు

 

 

 

 

 

 

జనవరి 7 ( జనం సాక్షి) నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే చెప్పులు, పాస్ పుస్తకాలు, ఆధార్ జిరాక్స్‌లు, రాళ్లు క్యూలైన్‌లో పెట్టి యూరియా కోసం వేచి ఉన్నారు.

వారం రోజులుగా యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి వచ్చి వెళ్తున్నామని రైతులు చెబుతున్నారు. ఎప్పుడు వచ్చినా స్టాక్ లేదని చెబుతున్నారని వాపోతున్నారు.