150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం

 

 

 

 

తుంగతుర్తి నవంబర్ 7 (జనం సాక్షి)

తుంగతుర్తిలో విద్యార్థులతో భారీ ర్యాలీ భారత జాతీయ గేయమైన వందేమాతరం, ను రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం తుంగతుర్తి మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై విద్యార్థులచే జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ వద్ద సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ మేరకు పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో వందేమాతరం గేయం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చి సామాన్యులను సమరయోధులుగా మార్చిందన్నారు. ఈ గేయాన్ని బంకించంద్ర చటర్జీ నవంబర్ 7న 1875లో వ్రాశారని అన్నారు. ఈ గేయం అహింసాయుత భారత స్వాతంత్రోద్యమంలో రణ నినాదంగా ఉపయోగపడిందన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానంద్, జిల్లా పరిషత్ తుంగతుర్తి వ్యాయామ ఉపాధ్యాయులు యాకయ్య, శ్రీ విద్యా భారతి పాఠశాల ఉపాధ్యాయులు అంబటి రమేష్, సురేష్ స్థానిక ఎస్సై ఆర్ క్రాంతి కుమార్, తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు