పెద్దల బాబు కుటుంబానికి అండగా ఉంటాం

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, జనవరి 22 (జనం సాక్షి):భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని నాలుగో వార్డు ఇందిరా నగర్ కాలనీకి చెందిన మున్సిపల్ ఉద్యోగి పెద్దల బాబు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న భువనగిరి శాసనసభ సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం మృతుడి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెద్దల బాబు అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఉద్యోగ లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తడక వెంకటేష్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పెన్నిధి అని, పేద కుటుంబానికి ఎక్కడ ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటుందని పేర్కొన్నారు. పెద్దల బాబు కుటుంబానికి ఎల్లవేళలా సహాయంగా నిలుస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు కుక్క బాల నరసింహ, నాలుగో వార్డ్ ఇన్చార్జి కుక్క కుమార్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పెద్దల సుధాకర్, నాయకులు కొమ్ము లక్ష్మీనారాయణ,ఏర్ర బిక్షపతి, కరగల్ల కుమార్, నల్ల నాగేశ్వర్, కుక్క బిక్షపతి, కుక్క బాలరాజ్,శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


