తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్

హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం ప్రజా భవన్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ఆయన సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. ఒక్కో స్కూల్ 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆంగ్ల మద్యమం 12 వ తరగతి వరకు అందుబాటులో ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఓన్ బిల్డింగ్స్ లేవన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూల్ మోడల్ గా ఉండనున్నాయని వివరించారు.