అఫ్ఘాన్‌లో మారోమారు రెచ్చిపోయిన తాలిబన్లు

share on facebook

ట్రక్కు బాంబుతో భారీ పేలుళ్లు
కాబూల్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  ఆప్ఘనిస్తాన్‌లో  భారీ కారు బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని షాదారక్‌ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ట్రక్కు బాంబుతో గ్రీన్‌ విలేజ్‌ కాంపౌడ్‌లో పేలుడుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని మంత్రి నుష్రత్‌ దృవీకరించారు. ఆ ఏరియాలోని ఎన్డీఎస్‌ చెక్‌పాయింట్‌ వద్ద పేలుడు జరిగింది. అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలోనే అమెరికా ఎంబసీ కూడా ఉన్నది. భారీ పేలుడు వల్ల సుమారు 12 వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుకు తామే బాధ్యులమంటూ తాలిబన్‌ ప్రకటించింది. ఎన్డీఎస్‌ ప్రాంతానికి వస్తున్న ఓ విదేశీ కాన్వాయ్‌ని తాలిబన్లను టా/-గ్గం/ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎంత మంది మరణించారన్న విషయం ఇంకా తెలియరాలేదు. సుమారు 30 మందిని హాస్పటల్‌కు తరలించినట్లు సమాచారం.

Other News

Comments are closed.