అభివృద్ది కావాలో…విద్వేషం కావాలో తేల్చుకోండి

share on facebook

అభివృద్దిని నమ్మితే మాకు ఓటేయండి

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీస్తే కఠినంగా వ్యవహరిస్తాం

శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగురేస్తాం

టిఆర్‌ఎస్‌ మహిళా మేయర్‌ ఎన్నికవుతుంది

ఎంఐఎంతో ఎలాంటి పొత్తూ లేదు..మేయర్‌ పదవి వారికి ఇచ్చేది లేదు

కెసిఆర్‌ నాయకత్వంలో దూసుకుపోతున్న తెలంగాణ

విూట్‌ద ప్రెస్‌ లో మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌,నవంబర్‌19 జ‌నంసాక్షి : పసనిచేస్తున్న టిఆర్‌ఎస్‌ను మరోమారు గెలిపించడం ద్వారా హైదరాబాద్‌ అభివృద్దికి చేయూత ఇవ్వాలని మంత్రి కెటిఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను గత ఆరేళ్లలో అనేక రంగాల్లో అభివృద్ది చేశామని అన్నారు. మేముఅభివృద్ది చేసామని నమ్మితే ఓటేయండి లేకుంటే శిక్షించండని కెటిఆర్‌ అన్నారు. అభివృద్ది కావాలా..విద్వేషం కావాలో తేల్చుకోవాలన్నారు. అయితే అన్ని రంగాల్లో అభివృద్దికి కట్టుబడ్డ తమను ప్రజలు ఆదరిస్తారని, గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమ వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేస్తున్నామని, ఎంఐఎంతో పొత్తుగానీ.. ఆ పార్టీకి మేయర్‌ పదవి అప్పగించడం కానీ జరగదన్నారు. అలాగే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బీసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. హైదరాబాల్‌లో ఎవరైన మతకల్లోలాలు సృష్టిస్తే ఊరుకునేది లేదని పరోక్షగా బిజెపిని హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విూట్‌ ద ప్రెస్‌ విూట్‌లో మాట్లాడారు. బీజేపీ గెలిస్తే గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించగా.. స్పందించిన ఆయన మాట్లాడుతూ మేమైతే బల్దియావిూద గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. గోల్కొండ విూద ఇప్పటికే సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఎగురవేశారని, ఆ విషయం బండి సంజయ్‌కు తెలియనట్టుందని అన్నారు. గోల్కొండపై కాషాయాలు, కషాయాలు ఉండవన్నారు. అక్కడ ఇప్పటికే జాతీయ జెండా ఎగురవేశామన్నారు. ఇప్పుడు బండి సంజయ్‌ కొత్తగా చేసేదేవిూలేదన్నారు.

గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తామని చెప్పారని.. ఈసారి కూడా మళ్లీ ఛాలెంజ్‌ చేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రతిసారి నేనే చేయాలా? ఈసారి వాళ్లు ఎవరైనా సవాల్‌ చేస్తే నేను స్పందిస్తానని’ సమాధానం ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొత్తులపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పష్టత ఇచ్చారు. ఎంఐఎంతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. గతంలో పాతబస్తీలో ఐదు స్థానాల్లో గెలిచామని, ఈసారి పది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ విధానాలు బాగుండి, ఎంఐఎం మద్దతు ఇచ్చిందన్నారు. వాళ్లకు మేయర్‌ సీటు ఇవ్వడానికి తమకేమైనా పిచ్చా అని ప్రశ్నించారు. 100 స్థానాల్లో గెలిస్తే తాము మేయర్‌ అవుతాం కానీ.. వారికి ఎందుకిస్తామన్నారు. డిసెంబర్‌ నాలుగున టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మహిళ మేయర్‌గా కూర్చుంటుందని, తమకు వేరే ఆలోచన లేదని, ఎవరితో తమకు పొత్తు లేదన్నారు. ఈ ఆరేండ్ల కాలంలో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే వారు గుండె విూద చేయి వేసుకుని ఆలోచించాలి. నగరంలో పేకాట క్లబుల్లు లేవు.. గుడుంబా గబ్బు లేదు.. బాంబు పేలుళ్లు లేవు..

మత కల్లోలాలు లేవు.. అల్లర్లు లేవు.. కర్ఫ్యూ లేదు.. ఆకతాయిల ఆగడాలు లేవు.. పోకిరీల పోకడలు లేవు. ఇవి వాస్తవం ఇవన్నీ విూరు ఆలోచించాలి అని ప్రతిపక్షాలకు కేటీఆర్‌ సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో హైదరాబాద్‌ 16వ స్థానంలో ఉందన్నారు. దేశంలో 65 శాతం సీసీ కెమెరాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌లో 5 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి సంఖ్యను 10 లక్షలకు పెంచుతామనితెలిపారు. ఈ సీసీ కెమెరాలన్నింటీని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడి 6 సంవత్సరాల అయిపోయింది. ఆరున్నరేండ్ల కింద ఒక రకమైన అనిశ్చితి వాతావరణం ఉండే. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మత విద్వేషాలు చెలరేగుతాయని అన్నారు. అంధకారం అయిపోతోంది అని నిందారోపణలు చేశారు. కొత్త పెట్టుబడిదారులు కాదు.. ఉన్నవారే పారిపోతారు అని అన్నారు. మా నాయకత్వం విూద, ప్రత్యేకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ విూద నిందలు వేశారు. ఆరున్నరేండ్ల తర్వాత పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉంది. అన్ని కోణాల్లో ప్రగతి పథంలో ఉన్నాం.. భారతదేశం మనవైపు చూస్తుందనడానికి కారణం కేసీఆర్‌ మాత్రమే. ఎక్కడా కూడా గిల్లి కజ్జాలు, పంచాయితీలకు తావు ఇవ్వలేదు. పక్కా ప్రణాళికతో నగరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగర ప్రజల ప్రాధాన్యాలు, ప్రాథమిక అవసరాలు గుర్తించి పని చేశామన్నారు. గత గ్రేటర్‌ ఎన్నికల్లో కంటే ఇప్పుడు మెరుగైన సీట్లు సాధిస్తాం. ఇందులో అనుమానం అక్కర్లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ఎదుట ధర్నాలు జరిగేవని, శివారు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తాగునీటి కోసం యుద్దాలు చేసే పరిస్థితి లేదని, మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్‌ ముందుందన్నారు. త్వరలో హైదరాబాద్‌లో రెండు చెత్త డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ఎ/-లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో 3,200 స్వచ్ఛ ఆటోలు పనిచేస్తున్నాయని, గతంలో వారానికి 2 రోజులు పవర్‌ హాలిడేలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నారు. నిర్మాణ రంగం వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాంట్‌ ఏర్పాటు చేశామన్నారు. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు.. ఎన్నో విమర్శలు చేసినా… అసాధారణ పరిణతి చూపించారని కేటీఆర్‌ అన్నారు. జూన్‌ 2న 2014లో బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీస అవసరాలు, మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాల దృష్టిలో పెట్టుకుని పని చేశామన్నారు.

Other News

Comments are closed.