అభివృద్ది నినాదమే మా ప్రచారం

share on facebook

ప్రజల్లో భరోసా పెరిగిందన్న కొప్పుల
జగిత్యాల,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అభివృద్ధే నినాదమే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్తి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. నాలుగేళ్లలో తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేప్టి సఫీలీ కృథం అయ్యామని అన్నారు. అందుకే ప్రజలు తమవెన్నంటి ఉన్నారని అన్నారు. తమ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ఈ విషయాలను ఆదివారం సిఎం కెసిఆర్‌ సమక్షంలో జరిగే చర్చలు విశదీకరిస్తామని ఘనివారం నాడిక్కడ అన్నారు. అభివృద్దికి అడ్డుపడుఉతన్న కాంగ్రెస్‌ కూటమికి గుణపాఠం  తప్పదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోడవమే కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌
ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఉందన్నారు. రైతుల బీమా, రైతు బంధు పథకంతో ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలు పెంచడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టో తరవాత మరింత మార్పు కనిపిస్తోందన్నారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు అభివృద్ధి చేయాలని కొరుకుంటారని తెలంగాణలో మాత్రం అభివృద్ధి చేస్తుంటే, దాన్ని కోర్టులో కేసులు వేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి పోటీ చేయాలనే వద్ద అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారని చెప్పారు. ఎవరెన్ని చేసినా టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గతం కంటే రెట్టింపు మెజార్టీ రావడం ఖాయమని అన్నారు. కొప్పుల సమక్షంలో పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు  టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం కల్లా అని, పగటి కళలు మానుకోవాలని ఆ పార్టీ నాయకులు సూచించారు.
సీఎంగా కేసీఆర్‌ను మరోసారి చూడాలన్నాదే ప్రజల కోరిక అని, టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హావిూ ఇచ్చారు.

Other News

Comments are closed.