అలుపెరగని కృషితోనే గ్రామాభివృద్ది…

share on facebook

*లింగ్య తండాను ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతా….

-గ్రామ సర్పంచ్ రాంలాల్ నాయక్.

కురవి రూరల్ సెప్టెంబర్ 30 జనంసాక్షి  : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రోజు (బలపాల)లింగ్య తండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గుగులోతు రాంలాల్ నాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలో పలు వార్డులలోఉన్న డ్రైనేజీ సమస్యను తెలుసుకొని వాటిని శుభ్రం చేయడం జరిగింది సంభందిత వార్డు ప్రజల సహకారంతో ప్రతి రోజు ఏదో ఒక శ్రమదానం చేయించడం జరుగుతుందని, 8వ వార్డు,3వ వార్డులో గల అనేక డ్రైనేజి సమస్యలను ఈ రోజు ఆయా వార్డుల వారీగా సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిశుభ్రత,సీజనల్ వ్యాధులు,వాటి నిర్ములన మీద సర్పంచ్ గారు తగు  సూచనలు,సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు .అదే విధంగా అక్టోబర్ 6వ తేదీ వరకు మిగిలిన వార్డులకు సంబంధించిన ప్రజల సహకారంతో  గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా,ఆరోగ్యంగా ఉంచుటకు ఒక కార్యాచరణ ను సర్పంచ్  ప్రవేశ పెట్టడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత,స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ,వార్డు సభ్యులు నాగేష్,బుజ్జి,పంచాయతి సిబ్బంది సుభాష్,శంకర్,కృష్ణ,కిషన్,సురేందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.