ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలి పిఆర్ టియుటియస్.

share on facebook

ఏర్గట్ల సెప్టెంబర్ 23( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం లోని   PRTUTS జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి  PRTU సభ్యత్వ నమోదు కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడం లో PRTU సంఘం ఎప్పుడు ముందుంటుందని, ఇప్పటి వరకు అనేక సమస్యలను సాధించి ఉపాధ్యాయులకు ప్రయోజనాలు చేకూర్చిందని తెలియచేసారు, చాలా సంవత్సరాలనుండి బదిలీలు, పదోన్నతులు లేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం వెంటనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, అలాగే CPS విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేసారు,ఈ కార్యక్రమం లో PRTUTS ఏర్గట్ల మండల అధ్యక్షులు శేర్ల శ్రీనివాస్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రసాద్, ఆర్మూర్ డివిజన్ ఇంచార్జి తుమ్మల లక్ష్మణ్ పటేల్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బిజ్జి గోపి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, గటాడి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, మండల కార్యదర్శి సురేష్, హై స్కూల్ హెచ్ఎం మునీరొద్దీన్,పవన్, నందిపేట్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, త దితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.