ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి

share on facebook

ములుగు,మే18(జ‌నంసాక్షి): ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓచిన్నారిమృతిచెందింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి శ్రవంతి మృతి చెందింది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జీడివాగు సవిూపంలో ఎదురుగా వస్తున్న ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా దంపతులు గాయపడ్డారు.  గాయపడిన దంపతులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ముందు భాగం ధ్వంసమైంది.
టూవీలర్‌ ప్రమాదంలో యువకుడిమృతి
జగిత్యాల జిల్లాలోని కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌ వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడంతో మహేశ్‌ (22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Other News

Comments are closed.