ఎర్ర చందనం నిల్వలపై దాడులు

share on facebook

కడప,నవంబర్‌24(జ‌నంసాక్షి): కర్నాటక రాష్ట్రం సంపెగహల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కడప జిల్లా పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. స్టేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎర్ర చందనం నిల్వ చేశారన్న సమాచారం అందడంతో.. కడప పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. పోలీసులకు స్మగ్లర్ల నుంచి తీవ్ర

ప్రతిఘటన ఎదురైంది. దుండగులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాలను తగులబెట్టారు. ఈ దాడుల్లో ఐదు కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్‌ ఫయాజ్‌ను అరెస్టు చేశారు.

 

 

Other News

Comments are closed.