కాళేశ్వరంపై ఇంకా ఆగని కుట్రలు
కన్నీళ్లు పెట్టుకుంటున్న కాంగ్రెస్ వారు: కర్నె
హైదరాబాద్,సెప్టెంబర్17 (జనంసాక్షి) : ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుని, అమలు చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. కాళేశ్వరం పూర్తయినా ఇంకా కాంగ్రెస ఆటంకాలు సృష్టిస్తూనే ఉందని, అప్పులంటూ గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనన్నారు.రాష్ట్ర ఆవిర్భావం మొదటి ఏడాదిలో కరెంట్ ఇబ్బంది ఉండేదని,
పక్క రాష్టాల్ర నుంచి అతికష్టం విూద విద్యుత్‌ను కొనుగోలు చేసి 25లక్షల మంది బోర్లకు విద్యుత్‌ను అందించామన్నారు. కాళేశ్వరంపై ఇంకా కాంగ్రెస్ అక్కసు వీడలేదన్నారు. గతంలో మాదిరిగా రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా విత్తనాలు, ఎరువులు ముందుగానే స్టాక్ పెట్టుకుంటున్నమని పేర్కొన్నారు.
పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నమని పేర్కొన్నారు. రెండోపంట ధాన్యం కొనుగోలుకు రూ.5,500 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. రైతుకు లక్ష చొప్పున రూ. 17వేల కోట్లు రుణమాఫీ చేశామని వెల్లడించారు. రైతుకు ఉన్నటువంటి ఇబ్బందులను ఆలోచించి పంటల పెట్టుబడి పథకానికి శ్రీకారం చుట్టామని దీనికిగాను సిఎం కెసిఆర్ రూ. 12వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచే నిమిత్తం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం రూ. 500కోట్ల సబ్సిడీతో 10వేల ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. మార్కెట్‌లో రూ. 3వేలున్న కందులకు మద్దతు ధర ఇచ్చి 5,450.3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. మార్కెట్‌లో సోయాబీన్‌కు ధరలేకపోతే 1.50 లక్షల టన్నులు, శెనగలు లక్ష క్వింటాళ్లు, రూ.1450లు ధర ఇచ్చి 3 లక్షల టన్నులు మక్కలు కొన్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 24గంటల కరెంట్, నీళ్లు, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు ఇస్తున్నరని, తాముకూడా తెలంగాణలో కలుస్‌త్తామని మహారాష్ట్ర రైతులు అంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఇన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని ఆయన స్పష్టంచేశారు