గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో జర్నలిస్టులు

ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటిన విూడియా ప్రతినిధులు

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడవిూ, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. పలువురు జర్నలిస్టులు ఇందులో పాల్గొని మొక్కలునాటారు. ఈ కార్యక్రమానికి విూడియా అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని అల్లం నారాయణ సూచించారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం ఇంతింతై వటుడింతై అన్నట్లు ముందుకు పోవడం మనందరి విజయం అని టీఆర్‌ఎస్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ అన్నారు. సమాజం బాగుండాలని తపనపడి గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జర్నలిస్టు మిత్రులందరూ కదిలి రావడం నా హృదయాన్ని కదిలించింది. కలంతో జనాన్నికదిలించిన జర్నలిస్టు మిత్రులు ఇప్పుడు మొక్కలు నాటి ప్రజలందరికి చైతన్యం కలిగించడం చారిత్రాత్మకం అని ఎంపీ సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో ప్రఖ్యాత స్టంట్‌ మాస్టర్స్‌ రామ్‌, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు. బంజారాహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కులో వీరిద్దరూ మూడు మొక్కల చొప్పున నాటారు. ఈ సందర్భంగా రామ్‌, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని కొనిడయారు. ఈ సందర్భంగా సంతోష్‌ కుమార్‌కు రామ్‌లక్ష్మణ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రతి ఒక్కరూ మూడేసి మొక్కలు నాటాలని, ఎవరో పిలుస్తారు.. అని కాలయాపన చేయకుండా గ్రీన్‌ ఛాలెంజ్‌ ఉద్యమంలో పాల్గొనాలని రామ్‌లక్ష్మణ్‌లు ప్రజలకు పిలుపునిచ్చారు.