ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

share on facebook

టేకులపల్లి, సెప్టెంబర్ 26(జనంసాక్షి) : టేకులపల్లి తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కె వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చాకలి అయిలమ్మ 127 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సామాన్య కుటుంబంలో జన్మించి ఆమె పోరాట జీవితమంతా పీడిత ప్రజల కోసం పనిచేసిన మహనీయురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Other News

Comments are closed.