కనిపిస్తే కల్చిపడేసే పరిస్థితి తెచ్చుకోకండి సీఎం కేసిఆర్

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారంతా కోలుకుంటున్నారు.  ప్రజలు చెప్పినట్టు వినకపోతే కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికీ వినకపోతే ఆర్మీ రంగంలోకి దిగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. కరోనా కట్టడి చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు.

సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న కేసులు ఏప్రిల్‌ 7 కల్లా కోలుకొని డిశ్చార్జ్‌ అవుతారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 114 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. స్వతహాగా నియంత్రణ పాటించి ఎక్కడి వారు అక్కడ ఉండాలి. రాష్ట్రంలో 19,313 మందిపై నిఘా ఉంది. నిఘాలో ఉన్న వ్యక్తుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని చెప్పాం. అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది. ప్రజలు వందశాతం సహకరించాలి.

అమెరికా లాంటి దేశంలో కూడా ఆర్మీని రంగంలోకి దించారు. పరిస్థితి చేయిదాటితే షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు సహకరించకుంటే ఆర్మీని దించాల్సి వస్తుంది. షూట్‌ ఎట్‌సైట్‌ ఆర్డర్స్‌ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు.  జాగ్రత్తగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలి. కరోనా మీద అవగాహన తెచ్చే క్రమంలో పాజిటివ్‌ డైరెక్షన్‌లో ముందుకు పోవాలి. ఈ సమయంలోనే నాయకులు ప్రజల కోసం పనిచేయాలి.

మంత్రులంతా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉండాలి. వ్యవసాయ, వైద్య, మున్సిపల్‌ మంత్రులు అటుఇటు తిరగాల్సి ఉంటుంది. మనకు కరోనా ప్రభావం అంతగాలేదు అయినా సీరియస్‌గా తీసుకుంటున్నాం. కరోనా సోకని దేశం లేదని రిపోర్టులు వచ్చాయి. నిర్మల్‌లో క్వారంటైన్‌ నుంచి ఒక వ్యక్తి ౩ సార్లు తప్పించుకున్నాడు. మన దగ్గర కరోనా అనుమానితుల సంఖ్య 114. ఇది ప్రత్యేక పరిస్థితి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

అమెరికా లాంటి దేశంలో కూడా ఆర్మీని రంగంలోకి దించారు. పరిస్థితి చేయిదాటితే షూట్‌ ఎట్‌సైట్‌ ఆర్డర్‌ వస్తుంది. ప్రజలు సహకరించకుంటే ఆర్మీని దించాల్సి వస్తుంది. షూట్‌ ఎట్‌సైట్‌ ఆర్డర్స్‌ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. నిఘాలో ఉన్న వ్యక్తుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని చెప్పామని సీఎం పేర్కొన్నారు.