జనతా కర్యూకు ఉత్తమ్ మద్దతు

share on facebook

హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి): జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో స్పీడ్ గా కరోనా విస్తరిస్తుం దన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికేఎక్కువగా కరోనా వస్తుందన్నారు. కరోనాకు చికిత్స లేదని? నివారణ ఒక్కటే మార్గం అన్నారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఎవరు బయటకు రాకుండా ఉంటే కొంత వరకు అరికట్టేందుకు అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు. అయితే పేదలు, దినసరి కూలిలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. తెలుపు రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. పలు +నాన్స్ సంస్థలకి , చిన్న చిన్న ఉద్యోగులు వాయిదాలు చెల్లించే వారికి వెసులుబాటు కల్పించాలన్నారు.. ప్రభుత్వం ప్రజలకు సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. మిగతా వారిని చైతన్య పరచాలన్నారు. స్వీయ నియంత్రణ, సోషల్ డిస్టన్స్ పై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Other News

Comments are closed.