ఢిల్లీ రైతులకు మద్దతుగా ఆర్జెడీ భారీ ప్రదర్శన

share on facebook

పట్నా,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీహార్‌లో ఆర్జేడీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. బీహార్‌ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతులతో కలిసి తేజస్వియాదవ్‌ కూడా గాంధీ మైదాన్‌లో బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసనకారులు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌.. ఇటీవల కేంద్రం చేసిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Other News

Comments are closed.