తనలాగే అంతా జైలుకు వెళ్లాలన్నదే జగన్‌ మనోగతం

share on facebook

అవినీతిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
లోకేశ్‌పై దుష్పాచ్రారం దారుణం: టిడిపి

అమరావతి,ఆగస్టు4(జనం సాక్షి ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జగన్‌ జైలుకు వెళ్ళారు కాబట్టి అందరిని జైలుకు పంపాలనుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్‌ అన్నారు. తనలాగే అంతా
జైలుకు వెళ్లాలన్నదే ఆయన పన్నాగమని మండిపడ్డారు. అయితే తనలాగా అంతా అవినీతికి పాల్పడ్డారన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ బాబాయి గొడ్డలి పోటు నుంచి దారి మళ్ళించడానికి నారా లోకేష్‌ను కూడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు నందికి, పందికి తేడా తెలుసునని, వైకాపా రక్తపాతంలో నుంచి పుట్టిన పార్టీ అని, తాత రాజారెడ్డి వారసత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామిక వాదిగా లోకేష్‌ వుంటే.. ప్యాక్షన్‌ను నమ్ముకున్న వ్యక్తి జగన్‌ అని అన్నారు. కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి గుప్పెట బంధించిన సీఎం జగన్‌.. బాబాయి వివేకా మరణంపై జరిగిన తీరును ఖండిరచలేని భయంతో కుటుంబ సభ్యులున్నారని జవహర్‌ అన్నారు. తండ్రి వైఎస్‌ మరణం జగన్‌ రాజకీయ పీఠమైతే.. పాలనా సామర్ధ్య వారసత్వం లోకేష్‌ అని అన్నారు. ఈ ఇద్దరి వ్యక్తిత్వంలో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని జవహర్‌ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నిరసన ప్రదర్శనకు దిగింది. సోషల్‌ విూడియాలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ గురించి తప్పుడు ప్రచారంపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఆఫీస్‌ ఎదుట విజయ సాయి రెడ్డి ,దేవేందర్‌ రెడ్డిల చిత్ర పటాలను టీడీపీ నేతల చెప్పులతో కొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీకి టీడీపీ ఇన్‌చార్జ్‌ కోవెలమూడి రవీంద్ర వినతి పత్రం అందజేశారు.

Other News

Comments are closed.