తబ్లిగీపై సీబీఐ విచారణ అక్కర్లేదు

share on facebook

` సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ,జూన్‌5(జనంసాక్షి): దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశంపై సీబీఐ విచారణ అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. సంఘటన జరిగిన అనంతరం చేపట్టిన విచారణలో ప్రతి విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటున్నట్లు తొపుతూ సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్‌ దాఖు చేసింది. దీనిపై దిల్లీ క్రైంబ్రాంచ్‌ పోలీసు చేపట్టిన విచారణ తుది దశకు చేరుకుందని.. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ఇచ్చిన గడువులోనే సమర్పించనుందని స్పష్టం చేసింది. తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం విషయంలో దిల్లీ ప్రభుత్వంతోపాటు దిల్లీ పోలీసు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. సీబీఐ దర్యాప్తు జరపాని సుప్రియా పండిత అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా కోర్టులో అఫిడవిట్‌ దాఖు చేసింది.మరోవైపు తబ్లిగీ జమాత్‌ ట్రస్ట్‌ ఆర్థిక లావాదేమీ అనుమానాస్పదంగా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. సీబీఐతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) కూడా  దీనిపై విచారణ చేపట్టింది. విదేశానుంచి వచ్చి తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారిపై దిల్లీ పోలీసు కూడా కేసు నమోదుచేసి కోర్టుల్లో పు ఛార్జిషీట్లు కూడా వేశారు. తబ్లిగీ జమాత్‌ అధినేత మౌలానా సాద్‌పై ఐసీసీతో పాటు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద పు కేసు కూడా నమోదు అయ్యాయి.దేశవ్యాప్తంగా కరోనా తీవ్రతకు దిల్లీలో జరిగిన మర్కజ్‌ సమావేశం కేంద్ర బిందువైన విషయం తెలిసిందే. దీనిలో పాల్గొన్న విదేశీయుల్లో వంద మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరు దేశంలోని పు రాష్ట్రాకు వెళ్లడంతో వైరస్‌ విస్తృత వేగంతో అన్ని రాష్ట్రాకు పాకింది.

Other News

Comments are closed.