దేశవ్యాప్తంగా ప్రశాంతంగా బంద్‌ 

share on facebook

– రోడ్లపైకొచ్చి నిరసన తెలిపిన కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు
– బస్సులను అడ్డుకున్న ఆందోళన కారులు
– పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితి
– తెలుగు రాష్టాల్ల్రో పాక్షికంగా బంద్‌
న్యూఢిల్లీ, జనవరి 8(జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్లు బుధవారం తలపెట్టిన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా సాగింది. కేంద్ర కార్మిక సంఘాలతో పాటు ఆయా రాష్టాల్ల్రోని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, బీజేపీయే యేతర పక్షాలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్‌ ప్రారంభమైంది. తెలుగు రాష్టాల్ల్రో బంద్‌ పాకిక్షింగానే సాగినా.. తమిళనాడు-కేరళ సరిహద్దులో ఆందోళనకారులు బస్సులను నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనివల్ల శబరిమల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పుదుచ్చేరిలో ప్రైవేటు విద్యాసంస్థల మూసివేశారు. విజయవాడలో బంద్‌ కొనసాగింది. బస్టాండ్‌ ఎదుట జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్‌ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్‌ చేపట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఎన్‌ఆర్‌సీ, సీఏఏ ,అలాగే కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని కేంద్రంలోని బీజేపీకి కాలం చెల్లిందని ఆందోళన కారులు నిరసన తెలియజేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో వామపక్ష నేతలతో పాటు కార్మిక సంఘాలు కదంతొక్కాయి. ఉదయం 6 గంటల నుంచి కార్మికులంతా సమ్మెలో పాల్గొని నిరసనలు తెలిపారు. కేంద్రం.. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంద్‌ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో విద్యాలయాలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. బస్టాండ్‌ వద్ద వామపక్ష పార్టీ నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేస్‌, పోస్ట్‌ ఆఫీస్‌ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే  వామపక్ష నేతలు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్నారు. మరోవైపు మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో సింగరేణి కార్మికులు రోడ్డెక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెకు దిగారు. నిరసన చేపట్టిన కార్మిక నాయకులు గనుల్లోకి వచ్చేందుకు ప్రత్నించడంతో పోలీసులువారి అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, కార్మిక నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కార్మిక  సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అదేవిధంగా విజయనగరంలో కార్మికులు కదం తొక్కారు. అరెస్టు పర్వాల నడుమ విజయనగరం సార్వత్రిక సమ్మెతో ఎరుపెక్కింది. కార్మిక వర్గాల నినాదాలతో ¬రెత్తింది. బుధవారం ఉదయం గజపతినగరంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయనగరం గుమ్మలక్ష్మీపురం రూరల్‌ సిపిఐ పార్టీ ఆఫీసు నుంచి ఎఐటియుసి ఆధ్వర్యంలో సమ్మె కు భారీ ర్యాలీ గా కార్మికులు బయలుదేరారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలంటూ  గుమ్మలక్ష్మీపురంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జూనియర్‌
కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యవంతమైన చదువులు అందించాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో భాగంగా.. గిరిజన సంఘం కార్యాలయ ఆవరణంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం మండల అధ్యక్షులు గణపతి కార్యదర్శి గర్ల్స్‌ కన్వీనర్‌ కావేరి ఉన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం జాతీయ
రహదారిపై రాస్తారోకో చేపట్టారు. శృంగవరపుకోట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భవన నిర్మాణ కార్మికులు, ఆశాలు, అంగన్వాడీలు, క్వారీ కార్మికులు పాల్గన్నారు. మదమానాపురం జాతీయ రహదారిపై విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద సార్వత్రిక సమ్మె లో భాగంగా.. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎ.చంద్రయ్య, కార్యదర్శి రాములు మాట్లాడుతూ… బస్సు రూట్ల ప్రయివేటీకరణ అపాలని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాలను అపివేయాలని, కార్మిక చట్టాలల్లో మార్పులు ఆపాలని డిమాండ్‌ చేశారు. మోటారు వాహన చట్టంలో భాగంగా.. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
/ుజయనగరం పట్టణంలో సార్వత్రిక సమ్మె నేపథ్యంలో.. భారీ ప్రదర్శన నిర్వహించారు. జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా.. కురుపాం మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. సిపిఎం నాయకులు మండంగి శ్రీనివాసరావు, పువ్వల తిరుపతిరావు, సిఐటియు నాయకులు పి.ఇందిరా, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఉమా, సరోజ, సిపిఐ నాయకులు సూరయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆలాజీ, రమేష్‌ అంగన్వాడీ టీచర్స్‌ అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌, ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీపురం లో సిపిఎం నాయకులను సుమారుగా 600 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే నేతలు తమ నిరసనను కొనసాగించారు. బలిజిపేటలో సార్వత్రిక సమ్మెకు కార్మికులు భారీ సంఖ్యలో కదలివచ్చారు. ఇదిలాఉంటే హైదరాబాద్‌లో క్యాబ్‌, ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని, దీనికి నిరసనగా.. బంద్‌ చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు బుక్కైన సుమారు 3వేలకు పైగా ఒలా, ఊబెర్‌ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో బుధవారం 80వేలకు పైగా క్యాబ్‌లు, లక్షకు పైగా ఆటోలు రోడ్కెక్కవని ఆటో, క్యాబ్‌ జేఏసీ చైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు. కాగా, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వారి నుంచి ప్రధానంగా వినిపిస్తోంది. నగరంలో కొన్ని క్యాబ్‌లు మాత్రం నడుస్తున్నా ధర మాత్రం చుక్కలు చూపిస్తోంది. సాధారణ రేటు కన్నా రెట్టింపు వసూలు చేస్తుండం గమనార్హం. మోటారు వాహన చట్టం-2019ను రద్దు చేయాలని, ఒకవేళ బుకింగ్‌ రద్దు చేస్తే రూ.500 జరిమానా వేయడాన్ని నిలిపివేయాలని క్యాబ్‌ డ్రైవర్లు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ-చలాన్లు తీసేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని క్యాబ్‌ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఇంకా, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా తప్పనిసరిగా అందించాలని కూడా వారు డిమాండ్‌ చేశారు. డ్రైవర్లకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని సలావుద్దీన్‌ కోరారు.
మోదీ, అమిత్‌షాల వల్లే దేశంలో నిరుద్యోగ భూతం – రాహుల్‌ గాంధీ ధ్వజం
ప్రధాని మోదీ, ¬ం మంత్రి అమిత్‌ షాలతో కూడిన ప్రభుత్వ..ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల కారణంగానే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బుధవారం ‘ భారత్‌ బంద్‌ ‘ కు పిలుపునిచ్చిన 25 కోట్ల మంది కార్మికులకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని
ఆయన అన్నారు. ఈ బంద్‌ కు ఆయన పూర్తి మద్దతును ప్రకటించారు .’ మోదీ, షాల ప్రభుత్వం ఈ దేశంలో నిరుద్యోగ భూతాన్ని సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్రోనీ కేపిటలిస్టు స్నేహితులను సంతృప్తి పరచేందుకు మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తున్నారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.
ఇందిరాపార్క్‌ వద్ద సమ్మె
నగరంలోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ 10 కేంద్ర కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఎల్‌ఐసీ, బ్యాంక్‌, జర్నలిస్ట్‌ సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి.

Other News

Comments are closed.