నకిలీ విత్తనాలు అమ్మిత కఠిన చర్యలు

share on facebook

సిద్దిపేట,మే21(జ‌నంసాక్షి): అనుమతి లేని కంపెనీల రకాల విత్తనాలు, నకిలీ విత్తనాలు, ఎరువులను అమ్మితే వ్యాపారులపై, కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు హెచ్చరించారు. వారిపై పోలీస్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. నామమాత్రపు నాణ్యతతో నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలు, అమ్మే వ్యాపారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు, పోలీసు అధికారులు కలిసి వారం రోజుల పాటు అన్ని దుకాణాలలో
సోదాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు బీజీ3, నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.  వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే సదరు దుకాణాల లైసెన్సు రద్దు చేయడంతో పాటు, పీడీయాక్టు నమోదు చేస్తామని.అన్నారు. కలెక్టర్‌, కమిషనర్‌ ఆదేశాలతో పలు ఎరువుల దుకాణాలను స్థానిక పోలీసులతో కలసి అధికారులు  ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. దుకాణాల్లోని ఎరువుల విత్తనాల నిల్వలను పరిశీలించారు.

Other News

Comments are closed.