నగరంలో పోలీసుల కార్డన్‌ సర్చ్‌

share on facebook

50మంది అక్రమ విదేశీయుల పట్టివేత

హైదరాబాద్‌,డిసెంబర్‌2( జనం సాక్షి ) : నగర శివార్లలోని రాజేంద్రనగర్‌ బండ్లగూడలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. విదేశీయులే లక్ష్యంగా బండ్లగూడ, రాధానగర్‌ కాలనీలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 200 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా ఉంటున్నారని చెప్పారు. అయితే తామంతా విద్యార్థులమని, తమనెందుకు తీసుకెళ్తున్నారని విదేశీయులు పోలీసులతో గొడవకు దిగారు.

Other News

Comments are closed.