పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

share on facebook

నల్లగొండ,అక్టోబర్‌29 (జనం సాక్షి ):   వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో ఉన్న మహాతేజ రైస్‌మిల్‌ సవిూపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి – అద్దంకి రహదారిపై వేగంగా వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. పిడుగురాళ్ల డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి పిడుగురాళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Other News

Comments are closed.