*పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు*

share on facebook
*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(15):* గోపాల్ పేట్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏదుట్ల లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు, జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను అలరించాయి అదేవిధంగా 2021 – 22 సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఇట్ట శ్రీనిధి, 9.0 జిపిఏ, నడింపల్లి పల్లవి 8.8 జీపీఏ సాధించినందుకు విద్యార్థులకు ఏదుట్ల గ్రామానికి చెందిన పల్లా నారాయణ శాస్త్రి పల్లా కిష్టమ్మ జ్ఞాపకార్థం గా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మొదటి స్థానంలో 1000 రూపాయలు రెండవ స్థానంలో 750 రూపాయలు లను పల్లా రామేశ్వర్ శర్మ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్థానిక సర్పంచ్ ఉడుముల శ్రీలత చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నారాయణమ్మ, ఎంపిటిసి బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ క్రాంతి రావు, ఉపాధ్యాయులు నరేంద్రాచారి, కురుమన్న, శ్రీనివాసులు, దామోదర్ రెడ్డి, సీనయ్య, మురళి, రాధా, గోపాల్, శ్రీదేవి, పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.