పార్టీనీ వీడలనుకున్నవాళ్లు గెటౌట్‌..

share on facebook

 

కోల్‌కతా,జనవరి 25(జనంసాక్షి):ప్రజలకు సేవ చేసేవాళ్లకే తాము టికెట్లు ఇస్తామని, మిగతా వాళ్లు బీజేపీలోకి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. బీజేపీ ఓ వాషింగ్‌ పౌడర్‌ అని, దానితో వీళ్లు తమ బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకోవడానికే ఆ పార్టీలోకి వెళ్లారని మమతా అన్నారు.నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా జైశ్రీరామ్‌ నినాదాలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. ఆ నినాదాలు బెంగాల్‌ను అవమానించడమే అవుతుందని హుగ్లీలో జరిగిన పబ్లిక్‌ విూటింగ్‌లో ఆమె స్పష్టం చేశారు. జైశ్రీరామ్‌ నినాదాల కన్నా.. నేతాజీని ఉద్దేశించి నినాదాలు చేసి ఉంటే తాను వాళ్లకు సెల్యూట్‌ చేసేదానినని ఆమె అన్నారు. తన గొంతయినా కోసుకుంటాను కానీ.. బీజేపీ ముందు మాత్రం తలవంచను అని మమతా ఈ సందర్భంగా అనడం గమనార్హం. ప్రధాని మోదీ సమక్షంలో జై శ్రీరామ్‌ నినాదాలు వినిపించడంతో మమతా మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రధాని సమక్షంలో వాళ్లు నన్ను టీజ్‌ చేయడానికి ప్రయత్నించారు. సుభాష్‌ చంద్రబోస్‌ను విూరు పొగిడి ఉంటే నేను విూకు సెల్యూట్‌ చేసేదానిని. విూరు నన్ను గన్‌ పాయింట్‌లో పెడితే.. ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు. వాళ్లు ఆ రోజు చేసిన పని బెంగాల్‌కే అవమానం అని మమతా అన్నారు.

 

Other News

Comments are closed.