పిడుగుపాటుకు ఇద్దరు మృతి…

share on facebook

గద్వాల రూరల్ ఆగష్టు 04 (జనంసాక్షి):- గద్వాల మండలం బస్రాచెర్వు గ్రామానికి చెందిన శశిధర్(14) గురువారం మద్యాహ్నం వ్యవసాయ పొలం వద్ద ఉండగా వర్షం కురుస్తుండటంతో చెట్టుకింద నిలుచున్నాడు. ఉరుములతో కూడిన పిడుగు‌ చెట్టుమీద పడటంతో శశిధర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగ బాలుడు అనంతపూరం జెడ్పీహెచ్ఎస్ లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ వెళ్లకపోవడంతో తమ వ్యవసాయ పొలానికి వెళ్లాడు.అలాగే మల్దకల్ మండలం పావనం పల్లి గ్రామానికి చెందిన రైతు రవి పొలం పనులు చేస్తుండగా ఈరోజు మద్యాహ్నం పిడుగుపడటంతో రైతు రవి మృతి చెందాడు‌. భార్యకు తీవ్రగాయాలు. కాగ రైతుకు చెందిన రెండు ఎద్దులు కూడా పిడుగుపాటుకు మృతి చెందాయి.

Other News

Comments are closed.