*పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం. ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి*

share on facebook

మెట్ పల్లి టౌన్ , సెప్టెంబర్23,(జనంసాక్షి)
పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం అని ఐసిడిఎస్ సూపర్ వైజర్ శోభారాణి అన్నారు. శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని న్యూ బోయవాడలోని అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా బొడ్డెమ్మ సంబరాలు జరుపుతున్నామన్నారు. పోషక విలువలు గల ఆహారంను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినాలని, ఆహారం తినే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. మొదటి 15 రోజులు పిల్లలందరివి ఎత్తు, బరువులు ,చుట్టు కొలతలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తీసుకున్నామన్నారు. గర్భిణీ, బాలింతలు, పిల్లలు సమతుల ఆహారం తీసుకోవాలని పోషణతోనే మంచి ఆరోగ్యం ఉంటుందని వివరించారు.
తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అవసరమని వివరించారు. పారిశుద్ధ్యం, పోషణ, పసిపిల్లలకు తల్లిపాల ఆవశ్యకత తెలియజేశారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ తల్లులందరిచే చేయించారు.
ఈ కార్యక్రమంలో అంగనవాడి టీచర్స్ స్రవంతి, సుమలత రాజమణి ,లావణ్య ,సుజాత , గర్భిణిలు, బాలింతలు, తల్లులు, పిల్లలు అంగన్వాడీ టీచర్స్ , ఆయాలు పాల్గొన్నారు.

Other News

Comments are closed.