ప్రతి శనివారం నో బ్యాగ్‌ డే మణిపూర్‌ సిఎం ప్రకటన

share on facebook


న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జనం సాక్షి ) :

మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యార్థులకు ఆయన గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 8వతరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి శనివారం నో స్కూలు బ్యాగ్‌  డే  గా అమలు చేస్తామని సీఎం బీరేన్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రపంచం వేగంగా మారుతుందని, అందుకే పాఠశాల విద్యార్థులకు కొంత స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. ఇక నుంచి ప్రతీ శనివారం పాఠశాలకు విద్యార్థులు స్కూలు బ్యాగ్‌ లేకుండానే వస్తారని బీరేన్‌ సింగ్‌ వివరించారు. విద్యార్థులకు స్కూల్‌ బ్యాగుల మోత తప్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Other News

Comments are closed.