మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే సహించేదిలేదు

share on facebook

– ఉక్కుపాదంలో అణిచివేస్తాం

– ప్రపంచంలో శాంతికి చిరునామా హైదరాబాద్‌

– హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుతాం

– మీట్‌ దిప్రెస్‌లో కేటీఆర్‌

హైదరాబాద్‌,నవంబరు 19(జనంసాక్షి): హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని దెబ్బతీయాలని చూస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. ఎకానమిక్‌ ఇంజిన్‌గా ఉన్న హైదరాబాద్‌ను విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? ప?రజలు ఆలోచించుకోవాలి అని కేటీఆర్‌ సూచించారు. మాది గల్లీ పార్టీ.. వాళ్లు ఢిల్లీ పార్టీ.. హైదరాబాద్‌ను గల్లీ పార్టీ ఏలాల? ఢిల్లీ పార్టీ ఏలాల? ప?రజలు ఆలోచించుకుంటారు. గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామనడం ఉట్టి మాటలు.. ఇప్పటికే గోల్కొండపై జాతీయ జెండా ఎగురవేశాం. ఇప్పుడు బల్దియా విూద గులాబీ జెండా ఎగురవేయం ఖాయమన్నారు. ఈ ఆరేండ్ల కాలంలో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విూట్‌ ది ప్రెస్‌లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే వారు గుండె విూద చేయి వేసుకుని ఆలోచించాలి. నగరంలో పేకాట క్లబుల్లు లేవు.. గుడుంబా గబ్బు లేదు.. బాంబు పేలుళ్లు లేవు.. మత కల్లోలాలు లేవు.. అల్లర్లు లేవు.. కర్ఫ్యూ లేదు.. ఆకతాయిల ఆగడాలు లేవు.. పోకిరీల పోకడలు లేవు. ఇవి వాస్తవం ఇవన్నీ విూరు ఆలోచించాలి అని ప్రతిపక్షాలకు కేటీఆర్‌ సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో హైదరాబాద్‌ 16వ స్థానంలో ఉందన్నారు. దేశంలో 65 శాతం సీసీ కెమెరాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌లో 5 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి సంఖ్యను 10 లక్షలకు పెంచుతామనితెలిపారు. ఈ సీసీ కెమెరాలన్నింటీని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడి 6 సంవత్సరాల అయిపోయింది. ఆరున్నరేండ్ల కింద ఒక రకమైన అనిశ్చితి వాతావరణం ఉండే. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మత విద్వేషాలు చెలరేగుతాయని అన్నారు. అంధకారం అయిపోతోంది అని నిందారోపణలు చేశారు. కొత్త పెట్టుబడిదారులు కాదు.. ఉన్నవారే పారిపోతారు అని అన్నారు. మా నాయకత్వం విూద, ప్రత్యేకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ విూద నిందలు వేశారు. ఆరున్నరేండ్ల తర్వాత పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉంది. అన్ని కోణాల్లో ప్రగతి పథంలో ఉన్నాం.. భారతదేశం మనవైపు చూస్తుందనడానికి కారణం కేసీఆర్‌ మాత్రమే. ఎక్కడా కూడా గిల్లి కజ్జాలు, పంచాయితీలకు తావు ఇవ్వలేదు. పక్కా ప్రణాళికతో నగరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగర ప్రజల ప్రాధాన్యాలు, ప్రాథమిక అవసరాలు గుర్తించి పని చేశామన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పన్నులు పెంచలేదు.. సామాన్యుడి నడ్డి విరచలేదు అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విూట్‌ ది ప్రెస్‌లో మినిస్టర్‌ కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖర్చు పెట్టాం. రెండు, మూడు రోజుల్లో ఆ వివరాలు విడుదల చేస్తాం. ప్రజల విూద ఒక పైసా కూడా భారం మోపలేదు. ఎలాంటి బిల్లులు పెంచలేదు. రాష్ట్ర ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు సాయం చేశాం.. పన్నులు పెంచలేదు.. ఇబ్బంది పెట్టలేదు. ప్రాపర్టీ ట్యాక్స్‌, వాటర్‌ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఛార్జీలు పెంచలేదు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ అయస్కాంతంగా మారింది. సుస్థిర ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమవుతుంది. టాస్క్‌ ద్వారా పిల్లలకు శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్నపూర్ణ ద్వారా 50 వేల మందికి నాణ్యమైన బోజనం అందిస్తున్నాం. లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. భారతదేశంలో ఇలాంటి ఇండ్లను ఏ రాష్ట్రం నిర్మించలేదు. 9714 కోట్ల రూపాయాలతో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కడుతున్నాం. ఇలాంటి నగరంలో భారత్‌లో ఎక్కడైనా ఉన్నాదా? అని సవాల్‌ చేస్తున్నా. అతి త్వరలోనే నిరుపేదలుకు ఇండ్లు కేటాయిస్తాం. లక్ష కుటుంబాలకు పట్టాలు ఇచ్చామన్నారు. లాక్‌డౌన్‌లో నిరుపేదలుకు రూ. 1500 ఇచ్చి ఆదుకున్నాం. వలసకూలీలను కూడా కడుపులో పెట్టుకున్నాం. వలస కూలీలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఉంది అని సీఎం అన్నారు. కూలీల పట్ల సీఎం కేసీఆర్‌ ఔదార్యం చూపారు. శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి తీసుకోకుండా వలస కూలీలను స్వస్థలాలకు పంపించాం. బస్తీ దవాఖానలు అద్భుతంగా పని చేస్తున్నాయి. గతంలో పేదవాడికి సుస్తీ చేస్తే దిక్కులేదు. వేల మందికి రక్త, మూత్ర తదితర పరీక్షలు చేస్తున్నాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం మజ్లిస్‌ పార్టీకి మేయర్‌ పదవి ఇస్తారనేది పిచ్చి ప్రచారం అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తేల్చిచెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విూట్‌ ది ప్రెస్‌లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. గత గ్రేటర్‌ ఎన్నికల్లో కంటే ఇప్పుడు మెరుగైన సీట్లు సాధిస్తాం. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదు. గత ఎన్నికల్లో ఐదు మజ్లిస్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచింది. డిసెంబర్‌ 4 తర్వాత టీఆర్‌ఎస్‌ మహిళా అభ్యర్థే మేయర్‌ అవుతారు.. ఇందులో అనుమానం అక్కర్లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Other News

Comments are closed.