మధురైలో భారీ అగ్నిప్రమాదం

share on facebook

చెన్నై,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం మధురైలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆసియాన్‌ కంప్యూటర్‌ సేల్స్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. 10 ఫైరింజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. అయితే అగ్నిప్రమాదంలో కంప్యూటర్లతో పాటు వాటి పరికరాలు పూర్తిగా కాలిపోయినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సవిూపంలో ఉన్న భవనాలకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Other News

Comments are closed.