మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచాలి-కలెక్టర్ శ్రీ హర్

share on facebook


రాజోలి ఆగస్టు 04(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా చేస్తున్న మన ఊరు మన బడి పనులను వేగంగా పూర్తి చేయాలని జోగులంభ గద్వాల్ జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. గురువారం మండలం లో ఆయన పర్యటించారు. మన ఊరు మన బడి పనులు జరుగుతున్న పెద్ద తాండ్రపాడు, పెద్ద ధన్వాడ, మందొడ్డి తుమ్మిళ్ల గ్రామాల్లో ని పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో నాణ్యత లోపించకుండా వేగం గా పూర్తి చేయలని అన్నారు.కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని విద్యార్థులు హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని తెలిపారు. పంద్రాగస్టు నాటికి పాఠశాల భవనాల పనులు పూర్తి చేయాలని, మిగతా పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందించాలని అన్నారు. పరిసరాల్లో పతిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ గోవింద్ రావ్, యమ్ ఈ ఓ నరసింహులు, పీఆర్ డీఈ ఆంజనేయులు, ఏఈ లక్షి నారాయణ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు

Other News

Comments are closed.