మూడు రోజుల్లో..  అయోధ్య తీర్పు!

share on facebook

– అప్రమత్తంగా ఉండాలని రాష్టాల్రకు కేంద్రం సూచన
– సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
– యూపీలోని అయోధ్యకు 4వేల పారామిలిటరీ దళాలు
– యూపీ సీఎస్‌, డీజీపీలతో సీజేఐ భేటీ
న్యూఢిల్లీ, నవంబర్‌8((జనంసాక్షి)) : దాదాపు శతాబ్ద కాలం నుంచి కొనసాగుతోన్న అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై సుప్రీం కోర్టు తీర్పు మరో రెండు మూడు రోజుల్లో తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్టాల్రకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పేర్కొంటూ ¬ం మంత్రిత్వశాఖ అన్ని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు 4వేల మంది పారామిలిటరీ దళాలను తరలించినట్లు ¬ంశాఖ అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ఆయా రాష్టాల్రు సైతం సున్నిత ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని ¬ంశాఖ సూచించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ
జరగకుండా చూసుకోవాలని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి పదవీకాలం ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఆ లోపే అయోధ్య తీర్పును వెలువరించే అవకాశం ఉంది. సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వం, మత సంస్థలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి కోసం కృషి చేస్తున్నాయి. మరోవైపు, అయోధ్య, లక్నోలో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. అత్యవసరమైతే వినియోగించడానికి రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. గురువారం అర్ధరాత్రి అత్యవసరంగా పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రతి జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం ఆరా తీసి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పినట్టు అధికారులు వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఊపేక్షించవద్దని ఆదేశించారని అన్నారు. లక్నోలో స్టేట్‌ లెవెల్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు ప్రతి జిల్లాకు ఓ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. మరోవైపు, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను శుక్రవారం ఢిల్లీకి పిలిపించిన చీఫ్‌ జస్టిస్‌ గొగొయ్‌ వారితో సమావేశం అయ్యారు. అయోధ్య తీర్పు అనంతరం ఎలాంటి ఘటనలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కీలక సూచనలు చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు.

Other News

Comments are closed.