రెండో రాజధాని పేరుతో… హైదరాబాద్ జోలికొస్తే ఖబడ్డార్

share on facebook

తెలంగాణను ఆగం చెయ్యడమే అంతిమ లక్ష్యం

• ఈ గడ్డ బిడ్డల శతాబ్దాల కష్టార్జితం హైదరాబాద్

• సాగర్ జీ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశంగా మారిన రెండో రాజధాని అంశం

• ప్రాంతీయ పార్టీల ప్రాభల్యంతో తెలంగాణలో అధికారం దక్కదనే అక్కసులో జాతీయ పార్టీలు

• రెండో రాజధానిగా హైదరాబాద్ అంటే మహోద్యమం

• సందు దొరికినప్పుడల్లా లొల్లి చేస్తున్న పచ్చమీడియా

• కావాలనుకుంటే నిర్మాణంలో ఉన్న అమరావతిని రెండో రాజధానిగా కేంద్రమే నిర్మించుకోవాలి

హైదరాబాద్, నవంబర్ 7(జనంసాక్షి):” కథనాన్ని జనంసాక్షి ప్రముఖంగా ప్రచురించింది. ఆ సమయంలో కొందరు ఈ హైదరాబాదును దేశ రెండో రాజధానిగా చేయాలనే అంశం మీద చర్చిస్తే కథనాన్ని ఉహాజనితం అంటూ కొట్టేసిండ్రు. కానీ ఇప్పుడు భాజపా నాయకులు బాగుంటుంది’ అని మహారాష్ట్ర మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ చేస్తున్న వ్యాఖ్యల ద్వారా హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా ప్రకటించి భాజపా నాయకులు సిఎచ్ విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలనే పన్నాగాలు ఇంకా కొనసాగుతు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ అంశం పట్ల తెలంగాణ వాదులు అప్రమ న్నాయని ఇప్పుడు స్పష్టమవుతుంది. ఈ గడ్డ బిడ్డల శతాబ్దాల కష్టార్జితమైన త్తంగా ఉండాలని “హైదరాబాద్ లూటీకి యూటీ పాట” అని గతంలోనే ఒక హైదరాబాదును తెలంగాణ నుండి దూరం మి- సందు దొరికినప్పుడల్లా లొల్లి చేస్తున్న పచ్చమీడియా – కావాలనుకుంటే నిర్మాణంలో ఉన్న అమరావతిని రెండో రాజధానిగా కేంద్రమే నిర్మించుకోవాలి చేయాలనుకునే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం సహించే పరిస్థితులు లేవు. గత అనుభవాలను పరిశీలిస్తే తెలంగాణను ఎప్పుడూ స్వేచ్చగా బతకనీయలేదనే అంశం అవగతమవుతుంది. నిజాం రాజ్యం భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రంగా విలీనమైన తర్వాత కొద్ది రోజులకే బాషా ప్రయుక్త రాష్ట్రాలనే సాకుతో తెలంగాణ మీద ఆంధ్ర అధిపత్యాన్ని రుద్దినారు. మళ్ళీ అరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటాల అనంతరం అమరవీరుల త్యాగఫలంగా తెలంగాణ వాదులు సంపూర్ణ తెలంగాణ సాదించిండ్రు. తెలంగాణ ప్రజల పోరాట పటిమను, ఆగ్రహాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినాయి. రాష్ట్ర ఏర్పాటుతోనైనా తెలంగాణలో నిలదొక్కుకోవాలని జాతీయ పార్టీలు ఆశించాయి. కానీ పచ్చ మీడియా సహకారంతో పెట్టుబడిదారుల కుట్రలకు ప్రభావితం అవుతున్న జాతీయ పార్టీలు తెలంగాణ అభివృద్దే అజెండాగా పనిచేయడం లేదని గుర్తించి తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆశలను వమ్ము చేశారు. ఎన్నికలు పూర్తయి ఏడాది కూడా పూర్తి కాకపోయినా ఆ పార్టీలు ఇప్పటికీ రాష్ట్రంలో అధికార పార్టీని దించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాయే తప్ప తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ఏమాత్రం ఆలోచించడం లేదు. ఈ పరిస్థితుల కారణంగానే ఆ పార్టీలకు తెలగాంణ ప్రజల నుండి వాళ్ళు ఆశిస్తున్నంత ఆదరణ లభించడం లేదు. దీనితో నిరుత్సాహానికి లోనౌతున్న పార్టీలు రకరకాల వ్యూహాలను అనుసరిస్తున్నాయి. అందులో భాగమే దేశ రెండో రాజధాని పేరుతో హైదరాబాదును తెలంగాణ నుండి దూరం చేసి ఇక్కడి నాయకత్వాన్ని బలహీనం చేయాలనుకుంటున్నాయి. కానీ కేవలం ఎదుటి వాళ్ళను బలహీనం చేయడం ద్వారా తాము బలపడతామనేది భ్రమ అని అన్ని పార్టీలూ గ్రహించాలి. నిజంగానే అవసరమనుకుంటే కామధేనువులా కనిపిస్తున్న హైద్రాబాద్ జోలికి రాకుండా నిర్మాణంలో ఉన్న అమరావతిని కేంద్రమే నిర్మించి దేశానికి రెండో రాజధానిగా ప్రకటిస్తే రెండు రాష్ట్రాల ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది.

Other News

Comments are closed.