రేపటి బంద్‌కు విపక్షాల సంపూర్ణమద్దతు

share on facebook

హైదరాబాద్‌,సెప్టెంబర్‌25 (జనంసాక్షి); కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27న జరగబోయే భారత్‌ బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్‌ను జయప్రదం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు తమ మద్దతు తెలుపుతూ కేంద్రం విధానాలను దుయ్యబట్టారు.
కోవిడ్‌ సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమయిª`యిందని, అలాగే రైతుల సమస్యల పరిష్కారంలోనూ నిర్లక్ష్యమే చూపిందని వివిద పార్టీల నేతలు విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం సాగుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు.

Other News

Comments are closed.