వరంగల్‌ నిట్‌లో గంజాయి కలకలం

share on facebook

వరంగల్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : వరంగల్‌ నిట్‌లో గంజాయి వాసన గుప్పుమంటోందన్న వార్తలు కలకలం రేపాయి. విద్యార్థులు ఇందుకు అలవాటు పడ్డారన్న వార్తుల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారయి.. హాస్టల్లోనూ, క్యాంపస్‌లోనూ యువకులు గంజాయిని పీలుస్తున్నారు. మత్తులో జోగుతున్నారు. గత ఆదివారం రాత్రి ఒంటిగంటకు హాస్టల్‌ వద్ద వివిధ కోర్సులకు చెందిన 12 మంది విద్యార్థులు గుంపుగా ఒక్కచోట చేరి గంజాయి పీలుస్తూ పట్టుపడ్డారు. క్యాంపస్‌లో సాధారణ తనిఖీలు చేసే సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. దీంతో విద్యార్థులవద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో..వారు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీ వేశారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందీ.. ఎవరు తీసుకువచ్చారు?.. ఎంతకాలం నుంచి ఈ వ్యవహారం నడుస్తుందన్న విషయాలపై కమిటీ ఆరా తీయనుంది. తెలంగాణలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై సర్వత్రా విమర్ళలు వెల్లువెత్తుతున్నాయి.

Other News

Comments are closed.