వాడపల్లి మృతులకు టిడిపి సంతాపం

share on facebook

22న విశాఖ ధర్మపోరాటంపై చర్చ: కళా
అమరావతి,మే16(జ‌నం సాక్షి): వాడపల్లి లాంచీ ప్రమాద మృతులకు టీడీపీ సంతాపం ప్రకటించింది.  తెలుగుదేశం పార్టీ  సమన్వయ కమిటీ సమావేశం అయ్యింది. ఈ నెల 22న విశాఖలో ధర్మపోరాట సభపై కమిటీ సమావేశంలో చర్చలు జరిపినట్లు మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. 14 నుంచి 21 వరకు నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించాలని, 23, 24న జిల్లాల్లో మహానాడులు పూర్తిచేయాలని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 27 నుంచి 29 వరకు జరిగే మహానాడుకు 14 కమిటీలు పనిచేస్తున్నాయని, గురువారం ఉదయం 9.30 గంటలకు మహానాడు నిర్వహించే సిద్దార్థ కాలేజిలో సమావేశం, ధర్మపోరాట దీక్షలు, సీఎం జిల్లాల పర్యటనలపై చర్చించినట్లు మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు.

Other News

Comments are closed.