సీఎం కేసీఆర్‌ స్పందించాలి

share on facebook

డబుల్‌ ఇళ్లకోసం ప్రగతి భవన్‌ ముట్టడి

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం తీసుకున్న జాగాలో ఇళ్లు నిర్మించినా తమకుకేటాయించడంలేదని కొందరు ఆందోళనకు దిగారు.వెంటనే వీటిని తమకు కేటాయించాలని ప్రగతి భవన్‌ ముట్టడించేందుకు ప్రయత్నించారు. డబుల్‌ ఇళ్లు కేటాయించినా చివరి దశలో స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాన్ని రెండు పడక గదులు కట్టేందుకు తీసుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదని తెలిపారు.సీఎం కేసీఆర్‌ స్పందించి తమ కాలనీకి చెందిన 150 మంది కుటుంబాలకు వెంటనే ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రగతి భవన్‌ ముట్టడికి వచ్చిన కాలనీ వాసులను అరెస్ట్‌ చేసి, పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు పోలీసులు.

Other News

Comments are closed.