Featured News

 మహబూబాబాద్‌ జిల్లా బంద్‌ ప్రశాంతం

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మహబూబాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : డ్రైవర్‌ నరేశ్‌  మృతికి నిరసనగా.. మహబూబాబాద్‌ జిల్లా బంద్‌కు జెఎసి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేపట్టారు. కార్మికుల ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జిల్లా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టసీ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో … వివరాలు

వరంగల్‌లో డిపోల ముందు కార్మికుల బైఠాయింపు

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : వరంగల్‌ పట్టణంలో ఆర్టీసీ 41వరోజు ఉధృతంగా సాగుతోంది. హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వరంగల్‌ గ్రావిూణ జిల్లా పరకాలలో నాలుగు గంటలపాటు డిపో ఎదుట బైఠాయించారు. తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వహించవద్దంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట బస్‌డిపో ఆవరణలో డ్రైవర్లు కండక్టర్లు యూనిఫారం … వివరాలు

విశ్వాసమా..? వివక్షా..?

ఈరెండింటి మధ్యే వివాదం విశ్వాసానికి చట్టబద్ధత కల్పించిన కేరళ హైకోర్టు 2018 నాటి తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు లింగ వివక్ష రాజ్యంగ వ్యతిరేకమన్న న్యాయస్థానం ఈ తీర్పుపై సవిూక్షించాలని పలు పిటిషన్లు అందుకే విస్తృత ధర్మాసనం ఏర్పాటు న్యూఢిల్లీ,నవంబర్‌14 (జనంసాక్షి) : శబరిమల ఆలయ వివాదం భక్తుల విశ్వాసం, లింగ వివక్ష మధ్య న్యాయసవిూక్షకు తెరలేపింది. … వివరాలు

దేశానికి రాహుల్‌ క్షమాపణ చెప్పాలి 

– బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా న్యూఢిల్లీ, నవంబర్‌14 (జనం సాక్షి)  : రాఫెల్‌ యుద్ధ విమానాల కొలుగోలు ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించిందని బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా విమర్శించారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవిూక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను … వివరాలు

ఆర్టీసీ కార్మికుల మృతికి కేసీఆరే కారణం

– బంగారు తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారింది –  బీజేపీ నేత బాబుమోహన్‌ సంగారెడ్డి, నవంబర్‌14 (జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ నియంతలా పాలన సాగిస్తున్నాడని, కార్మికుల మరణాలకు కేసీఆరే బాధ్యత వహించాలని బీజేపీ నేత, మాజీ మంత్రి బాబూమోహన్‌ అన్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వ తీరుకు మనస్తాపం … వివరాలు

బాలల సంక్షేమం కోసం..  ప్రభుత్వం కట్టుబడి ఉంది

– బాలల చట్టాల సమర్థ అమలుకు కృషి – భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించిన తప్పక శిక్షిస్తాం – మంత్రి సత్యవతి రాథోడ్‌ హైదరాబాద్‌, నవంబర్‌14 (జనం సాక్షి) : బాలల హక్కులు, వారి సంక్షేమం కోసం తెరాస ప్రబుత్వం కట్టుబడి ఉందని  గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. … వివరాలు

శబరిమలకు 36మంది మహిళల నమోదు

తిరువనంతపురం, నవంబర్‌14 (జనం సాక్షి)  : శబరిమల ఆలయ దర్శనానికి మహిళలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ కమిటీ స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌లో రిజిస్టేష్రన్‌ ప్రారంభించింది. ఇప్పటి వరకు స్వామి వారిని దర్శించుకోవడం కోసం 36మంది … వివరాలు

జేసీ దివాకర్‌రెడ్డికి మరోషాక్‌

– జేసీ ట్రావెల్స్‌ బస్సులపై అధికారుల దాడులు – పత్రాలు లేని ఆరు బస్సులు సీజ్‌ – రెండు దఫాలుగా 30 బస్సులను సీజ్‌ చేసిన అధికారులు అమరావతి, నవంబర్‌14 (జనం సాక్షి) : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డికి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రవాణాశాఖ అధికారులు దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై … వివరాలు

తెలుగు భాషను అగౌరవపరిస్తే..  మట్టిలో కలిసిపోతారు!

– వైసీపీలోని మేధావులు ఏం చేస్తున్నారు? – కులాలకు అతీతంగా, భాషాసంస్కృతులను కాపాడటమే జనసేన విధానం – జగన్‌ రెడ్డి అంటే తప్పేంటి.. జాతీయ విూడియానే అలా పిలుస్తుంది – జగన్‌ రెడ్డి అన్నందుకు.. పవన్‌ నాయుడు అంటూ హేలన చేస్తున్నారు – ఎలా పిలవాలో 151మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి ఇవ్వండి – జగన్‌ … వివరాలు

కశ్మీర్‌ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు

– లెప్టినెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌ చందర్‌ ముర్ము శ్రీనగర్‌, నవంబర్‌14 (జనం సాక్షి) : కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం.. ఆ రాష్ట్ర పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కశ్మీర్‌ లెప్ట్‌నెంట్‌ గవర్నర్‌ … వివరాలు