అక్రమ మద్యం పట్టివేత

మహముత్తారం జూన్‌12 (జనంసాక్షి)

మండలంలోని రేగులగూడెం గ్రామంపంచాయతీ పరిధిలో గల పోచంపల్లి గ్రామంలో మంగళవారం పోలీసులు దాడి చేసి ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన సూమారు 40 కాటన్లు మద్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే పోచంపల్లి కేంద్రంగా గత కొంత కాలంగా మద్యాన్ని బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మహముత్తారం పోలీసులు మంగళవారం దాడి చేసి నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు దృవీకరించాలేదు.