అఖిలపక్షానికి జగన్‌ హాజరుకావాలి : కవిత

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ అథినేత వైఎస్‌ జగన్‌ హాజరుకావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. చంచల్‌గూడ జైళ్లోనే ఉండి కోర్టు అనుమతితతో యూపీఏ అభ్యర్థికి ఓటు వేసిన జగన్‌ అదే పద్థతిలో అఖిలపక్షానికి కూడా హాజరై తెలంగాణపై ఆయనకున్న  చిత్తశుద్ధి చాటుకోవాలని ఆమె సవాలు విసిరారు.