అగ్ని -4 క్షిపణి ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా),సెప్టెంబర్‌ 19(జనంసాక్షి):
భారత్‌ బుధవారం అగ్ని-4 క్షిపణిని విజ యంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 4వేల కిలోమీటర్లు, వీలర్‌ దీవి, ఐటిఐర్‌ నుంచి ఉదయం 11.45కు ఈ ప్రయోగం జరిగిందని అధికారులు చెప్పా రు. ఇందులో అత్యంత అధునాతనమైన కంప్యూటర్‌ ఉంది. క్షిపణి వివిధ భాగాల్లో సదూర లక్ష్యాన్ని గుర్తించే ఏవియానిక్స్‌ వ్యవస్థుంది. కమ్యూనికేషన్‌ వసతి వుంది. డిజిటల్‌ కంట్రోల్‌ వ్వవస్థ ఉంది. దీన్ని చోదక క్షిపణిగా రూపొందించారు. అంటే భూమిపైన కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఆదేశాలు ఇచ్చి దీని గమనాన్ని వేగాన్ని మార్చవచ్చు నియంత్రించవచ్చు. రింగ్‌ లేసర్‌ గైరో సాధనం ద్వారా ఎటు వెళ్లాల్సిందీ మార్గమధ్యంలోనే ఆదేశాలు జారీ చేస్తారు. వాటిని క్షిపణి పాటించి లక్ష్యాన్ని కచ్చితంగా తాకుంతుంది. ఘన ఇంధనంతో నడుస్తుంది. 3 వేల సెంటిగ్రేడ్‌ ఉష్ణాన్ని తట్టుకుంటుంది.