అతను నా పీఆర్వో: ప్రభుత్వ విప్‌ సునీత

హైదరాబాద్‌, మార్చి 18: తాను పీఆర్వోని నియమించుకున్నానని, అతను మద్యం వ్యాపారి కాదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత తెలిపారు. అసెంబ్లీ లాబీలోని మద్యం వ్యాపారిని ఎలా తీసుకొస్తారని కాంగ్రెస్‌ నేత డీకే అరుణ వ్యాఖ్యలపై ఆమె ఈ విధంగా స్పందించారు. తన పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, అవసరమైతే సీసీ ఫుటేజీలు పరిశీలించవచ్చని చెప్పారు. డీకే అరుణ కుటుంబంపై అక్రమ మైనింగ్‌ ఆరోపలు పత్రికల్లో వచ్చాయని ఆరోపిస్తూ సునీత వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన స్పీకర్‌.. రికార్డులను పరిశీలించి తొలగిస్తామని చెప్పారు.