అత్యధిక సంపాదన ‘టామ్‌ క్రూయిజ్‌’!

లాస్‌ ఏంజిల్స్‌, జూలై 5 : హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ టామ్‌ క్రూయిజ్‌ మే 2011 నుంచి మే 2012 మధ్య కాలంలో సుమారు 75 మిలియన్‌ రెమ్యూనరేషన్‌ పరంగా తీసుకొని ప్రపంచంలో అత్యధిక డబ్బు సంపాదించిన యాక్టర్‌గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌ కొత్తగా విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. ఫోర్బ్స్‌ పత్రిక ప్రపంచంలో టాప్‌ 100 అత్యధిక డబ్బు సంపాదించే వారిని ప్రచురించగా… లియోనార్డో డికాప్రియో, ఆడమ్‌ సాండ్లర్‌ను అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 50 సంవత్సరాల వయసు కలిగిన టామ్‌ క్రూయిజ్‌ నటించిన ‘మిషన్‌ ఇంపాజబుల్‌-గోస్ట్‌ ప్రోటోకాల్‌’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 700 మిలియన్ల బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. గతయేడాది నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిన లియోనార్డో డిక్రాఫియా ఈ ఏడాది జాబితాలో హాస్యనటుడు ఆడమ్‌ సాండ్లర్‌తో కలిసి ఇద్దరూ 37 మిలియన్లు సంపాదించి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 36 మిలియన్లు సంపాదించిన మాజీ కుస్తీ పోటీదారుడు జాన్సన్‌ రికార్డుల్ని సృష్టించింది. 33 మిలియన్లు సంపాదించిన కమెడియన్‌ బెన్‌ స్టిలర్ల ఐదవ స్థానాన్ని సొంతం చేసుకోగా.. 30 మిలయన్లతో సచా బారోన్‌ ఆరవ స్థానంలో నిలిచాడు. టాప్‌ పది స్థానాల్లో జానీ డెప్‌, విల్‌ స్మిత్‌, మార్క్‌ వాల్‌ బెర్గ్‌, టేలర్‌ లాట్నర్‌లు ఉన్నారు.