అధికారులు హామీతో రిలే దీక్ష విరమణ

శ్రీకాకుళం, జూలై 28:లక్ష్మిపేట దళితుల హత్యలకు సంబంధించిన ఘటనపై ఫాస్ట్‌ ట్రాప్‌ కోర్టు ఏర్పాటు కోసం గత రెండు రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపడుతున్న లక్ష్మిపేట దళిత ఆత్మగౌరవ పోరాట కమిటీ ప్రతినిధులు దీక్షలు విరమింపచేసిననట్లు ప్రకటించారు. అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ రాజ్‌కుమార్‌ శనివారం నాడు శిబిరాన్ని సందర్శించి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరపింజేశారు. అంతకు ముందు జాయింట్‌ కలెక్టర్‌ పి.భాస్కర్‌ శిబిరాన్ని సందర్శించారు. కెవిపిఎస్‌ కార్యదర్శి గణేష్‌, కెఎన్‌పిఎస్‌ కృష్ణయ్య, రైతు కూలీ సంఘం ప్రతినిధి ప్రకాష్‌, మాల మహానాడు ప్రతినిధి అప్పరావు మాట్లాడారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున యంత్రాంగం హామీలతో దీక్షను విరమిస్తున్నట్టు పేర్కొన్నారు.