అధిక ధరకు గ్యాస్‌ సిలెండర్ల విక్రయం

కోరుట్ల: కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామంలో గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాల్సిన ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రూ. 420కి రాయితీ సిలిండర్లను సరఫరా చేయాల్సిన వుండగా రూ. 440కి పంపిణీ చేస్తున్న సిలిండర్ల వ్యానును శనివారం గ్రామస్థులు పట్టుకుని తహశీల్దార్‌ శ్రీనివాస్‌కు అప్పగించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. గ్యాస్‌ సరఫరా చేస్తున్న శ్రీరామ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సిబ్బంది ఈ అక్రమాలకు పాల్పడతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.