అధిష్టానానికి చెప్పాల్సిందంతా చెప్పాం

జాప్యం చేస్తే రాజీనామాలే అస్త్రం : జానా
న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి):
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీకి వెళ్లిన టీ మంత్రులు జానారెడ్డి, బస్వరాజ్‌ సారయ్య పి.సుదర్శన్‌రెడ్డి, డి,శ్రీధర్‌ బాబు, ఆదివారం అధిష్టాన పెద్దలతో భేటీ అయినారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్టానానికి చెప్పవల్సిన విషయాలను చెప్పామని రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు క్షేత్రస్థాయిలో తెలంగాణపై ప్రజల ఆకాంక్షను హైకమాండ్‌కు వివరించామన్నారు. 43మంది కాంగ్రెస్‌ శాసన సభ్యులు సంతకాలు చేసిన ప్రతులను అధిష్టానానికి అందించామని రాష్ట్రంలో ఇరు ప్రాంతాల నేతల మధ్య సమన్వయం లేకపోవటం వల్ల తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అధిష్టానం గుర్తించిందని పేర్కొన్నారు.
ఓ వైపు షర్మిల, మరో వూపు చంద్రబాబు పాదయాత్రలతో రాష్ట్ర కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారుతుందని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వాలని 30ఎమ్మెల్యే 13మంది మంత్రుల విజ్ఞప్తిని అధిష్టానానికి అందించినట్లు తెలిపారు. సోనియా గాంధీకి ఫ్యాక్స్‌ చేసినట్లు పేర్కొన్నారు.