అన్నదాతలూ అధైర్యపడొద్దు

తలమడుగు : పంట దిగుబడి  రాలేదని మనస్తాపం  చెంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని .జిల్లా కాంగ్రెస్‌ మాజీ మాహిళా అధ్యక్షురాలు గండ్ర సుజాత అన్నారు మంగళవారం తలమడుగులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల వారికుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని అన్నారు కాబట్టి అన్నదాతలు మనోధైర్యంతో ఉండాలని చెప్పారు పంట నష్టపోతె ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.