అన్నాను కలిసిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లి : సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేను అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఉదయం కలిశారు. ఇద్దరు గత కొంత కాలంగా బేధాభిప్రాయాలు నెలకొన్నయాన్న వార్తల నేపధ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరిచుకుంది. గాందీజయంతి పురస్కరించుకొని రేపు రాజకీయ పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో అన్నా ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్టు కేజ్రీవాల్‌ తెలిపారు. అవినీతి వ్యతిరేక పోరులో ‘మా దారులు వేరైనా.. గమ్యం మాత్రం ఒక్కటేనని’ ఆయన వాఖ్యానించారు.